భారత వాతావరణ కేంద్రం(IMD) దేశవ్యాప్తంగా భారీ వర్ష(Rain Alert) సూచన చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎటువంటి విపత్తులు తలెత్తకుండా సహాయక చర్యలు సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అటు ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read Also: ఎన్నో ప్రత్యేకతలతో తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం
Follow us on: Google News, Koo, Twitter