CSK vs PBKS |సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పంజాబ్ జట్టు షాక్ ఇచ్చింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో ఆఖరి బంతికి ధావన్ సేన విజయం సాధించింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టులో ప్రభ్‌సిమ్రాన్(42), లివింగ్‌స్టోన్(40), కెప్టెన్ శిఖర్ ధవన్(28), సామ్ కరన్(29) పరుగులతో రాణించారు. ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 9పరుగులు కావాల్సిన తరుణంలో పతిరణ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చివరి బాల్ వరకు మ్యాచ్ వచ్చింది. లాస్ట్ బాల్ కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా సికిందర్ రజా లెగ్ సైడ్ కొట్టిన బంతిని బౌండరీ దాటకుండా ఫీల్డర్లు ఆపినప్పటికీ 3పరుగులు తీయడంతో గెలుపు పంజాబ్ సొంతమైంది.
CSK vs PBKS |చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 3, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు 4వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్స్‌లో కాన్వే(92), రుతురాజ్(37), శివమ్ దుబే(28) పరుగులు చేశారు. ఆఖరి రెండు బంతులను కెప్టెన్ ధోని సిక్సర్లు కొట్టడం ఈ మ్యాచుకే హైలెట్ గా నిలిచింది. పంజాబ్ బౌలర్స్‌లో అర్షదీప్, సామ్ కరన్ చెరో వికెట్ తీశారు. కాగా చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచుకు తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు.
Read Also: మ్యాచ్ మధ్యలో కొట్టుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్
Follow us on: Google News, Koo, Twitter