క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ముఠా థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతూ అక్కడి పోలీసులకు చిక్కారు. పటాయాలోని ఓ హోటల్‌లో జూదం ఆడుతున్నారనే సమాచారంతో ప్రవీణ్ తో సహా మొత్తం 93మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. థాయ్‌లాండ్‌లో జూదంపై నిషేధం ఉన్నా ఆ దేశానికి చెందిన ఓ మహిళతో కలిసి చీకోటి ప్రవీణ్ ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడు.
కాగా పట్టుబడిన వారిలో మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఈడీ కేసులో నిందితుడు మాధవరెడ్డి కూడా ఉన్నారు. నిందితుల నుంచి రూ.21 కోట్ల విలువ చేసే గేమింగ్ చిప్స్ తో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ నిర్వాహకుడు ప్రవీణ్ ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే థాయిలాండ్ చట్టాల ప్రకారం జూదం నిర్వహించినట్లు రుజువు అయితే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది.