మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత

-

జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ(Arun Gandhi) (89) కన్నుమూశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరకు కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. మహాత్మాగాంధీ కొడుకైన మణిలాల్ గాంధీ(Manilal Gandhi) కొడుకే ఈ అరుణ్ గాంధీ. ఈయన దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్‌‌లో 1934 ఏప్రిల్‌ 14న మణిలాల్ గాంధీ, సుశీలా మష్రూవాలా దంపతులకు జన్మించారు. అరుణ్ గాంధీ మృతి వార్తను ఆయన కొడుకైన తుషార్ గాంధీ.. ట్విట్టర్ ద్వారా తెలిపారు. “ఇవాళ ఉదయం మా నాన్న చనిపోయారు. ఆయన లేని లోటును తట్టుకోలేకపోతున్నాం” అని తుషార్ ట్వీట్ చేశారు.

- Advertisement -
Read Also: కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...