Salaries In India |ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ఉద్యోగుల సగటు జీతం చాలా తక్కువగా ఉందని ఓ సర్వేలో తేలింది. ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ సంస్థ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో సగటున నెల జీతం రూ.46,861గా ఉందని పేర్కొంది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో నెలవారీ జీతాలకు సంబంధించిన గణాంకాలను ఈ సంస్థ ప్రకటించింది. ఎక్కువ జీతాలు అందుకుంటున్న జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడి ఉద్యోగులు నెలకు సగటున రూ.4,98,567 వేతనం అందుకుంటున్నారంది. తర్వాతి స్థానాల్లో లక్సెంబర్గ్, సింగపూర్, అమెరికా, ఐస్ ల్యాండ్, ఖతర్, డెన్మార్క్, యూఏఈ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ రూ.50 వేల కంటే తక్కువ సగటు వేతనం(Salaries In India)తో 65వ స్థానంలో ఉంది. ఇక 23దేశాల్లోని ఉద్యోగులు లక్ష రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారని వెల్లడించింది.
Read Also: ఇండియా టుడే సర్వేలో కర్ణాటకలో ఆ పార్టీదే అధికారం?
Follow us on: Google News, Koo, Twitter