చైనా నుంచి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR)కు ఆహ్వనం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవ్వాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే(Borge Brende) ఆహ్వానం పంపారు. సాంకేతికతతో తెలంగాణ దూసుకెళ్తోందని ప్రసంశల వర్షం కురిపించారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది. ఈ సదస్సుకు చైనాలోని టియాంజిన్ వేదిక కానుంది. కేటీఆర్ దార్శనికతతో తెలంగాణ నూతన ఆవిష్కరణలకు ధీటుగా, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో అగ్రగామిగా మారిందని డబ్ల్యూఈఎఫ్(WEF) ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే కేటీఆర్(Minister KTR)కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.
టీ-హబ్ వంటి భవిష్యత్-ఆధారిత విధానాలు మరియు ఎనేబుల్స్ ద్వారా భారతదేశం యొక్క స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ సిస్టమ్‌లో తెలంగాణ(Telangana) అగ్రగామిగా ఉందని, పాల్గొనేవారు తెలంగాణలో వ్యవస్థాపకత, ఆవిష్కరణ మరియు డిజిటల్ పరివర్తన ద్వారా వృద్ధిని ప్రోత్సహించడంపై మీ అంతర్దృష్టులను వినడానికి ఆసక్తిగా ఉంటారు” అని పేర్కొన్నారు.
Read Also: ఢిల్లీలో BRS ఆఫీస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
Follow us on: Google News, Koo, Twitter