‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం.. థియేటర్ల వద్ద కాంగ్రెస్ ఆందోళన

-

‘ది కేరళ స్టోరీ(The Kerala Story)’ సినిమా వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్(Pinarayi Vijayan) తో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ముస్లిం సంఘాలు ఫైర్ అవుతున్నాయి. సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ, తమిళనాడులో శుక్రవారం సినిమా విడుదల నేపథ్యంలో ఆందోళనలు చేపడుతున్నారు. కొచ్చిలోని థియేటర్ల దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సినిమా విడుదలను ఆపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆందోళన నేపథ్యంలో తమిళనాడులోని థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

- Advertisement -

The Kerala Story |థియేటర్లకు పూర్తి భద్రత కల్పించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కేరళలో మతమార్పిడిలు, రాడికలైజేషన్, టెర్రరిజం కాన్సెప్ట్ చేసుకుని ఈ సినిమాను సుదీప్తో సేన్ తీశారు. కేరళలో 32,000 మంది హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన మహిళలను ఇస్లాంలోకి మార్చారని ఐసీస్ చేరడానికి కొంత మంది సిరియాకు వెళ్లినట్లు సినిమా ట్రైలర్ లో చూపించారు. దీంతో వివాదం రాజుకుంది. ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమాను కొన్ని వర్గాలు ఆదరిస్తున్నాయి. ఈ సినిమాను తప్పకుండా చూడాలని అంటున్నారు. ‘పాకిస్తాన్‌లో 2 శాతం, అఫ్ఘనిస్తాన్‌లో ఒక శాతం కంటే తక్కువ మంది హిందువులు మిగిలారు, భారత దేశంలో ఈ సినిమా రుజువు చేస్తుంది’ అంటూ ఆన్లైన్‌లో ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తున్నారు.

Read Also: రొమాన్స్ చేయడానికే తీసుకుంటున్నారు: అనసూయ షాకింగ్ కామెంట్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock...