PhonePe |ప్రస్తుతం దేశంలో UPI చెల్లింపులు పెరిగిపోయాయి. చిన్న మొత్తాలకూ స్కానింగ్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇందుకోసం UPI పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ అవసరం లేకుండా మరింత సులభంగా చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(NPCI) UPI లైట్ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేటీఎం ఈ ఫీచర్‌ను ప్రారంభించగా.. తాజాగా ఫోన్‌పే కూడా UPI లైట్ అందుబాటులోకి తెచ్చింది. మీ ఫోన్ పే యాప్ లో UPI లైట్ యాక్టివేట్ చేసుకుంటే సింగిల్ క్లిక్‌తో పిన్ ఎంటర్ చేయకుండానే చెల్లింపులు చేయవచ్చు.
అయితే ఇందుకోసం వ్యాలెట్‌లో కొంత మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.2వేల వరకు డబ్బును జమ చేసుకోవచ్చు. ఒకేసారి రూ.200 వరకూ లావాదేవీని ఒక్క క్లిక్‌తోనే జరపవచ్చు. ఈ ఫీచర్ పొందాలంటే ముందుగా ఫోన్‌పే(PhonePe) యాప్ అప్టేడ్ చేసుకోవాలి. అనంతరం మీ అకౌంట్ ప్రొఫైల్ స్క్రీన్‌పై ‘UPI Lite’ ఆప్షన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేసి UPI లైట్ ఖాతాలో రూ.2000లోపు మీకు నచ్చినంత డబ్బు జమచేసుకోవాలి. తదుపరి ఏ క్యూర్ కోడ్‌నైనా స్కాన్ చేసి చెల్లింపులు చేసుకోవచ్చు.
Read Also: దయచేసి ఆలోచించండి.. హుస్నాబాద్ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి
Follow us on: Google News, Koo, Twitter