సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్(ORR) ప్రయివేటైజేషన్ వార్తలపై స్పందిస్తూ.. సీఎంకు పలు ప్రశ్నలు సంధించారు. ఆదివారం బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని.. టెండర్లలో పాల్గొంటామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన బీఆర్ఎస్(BRS) నేతలు ఓఆర్ఆర్‌ను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ వెనుక మతలబు ఏంటని, 30 ఏళ్ల వరకు ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎవరి మేలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. ఓఆర్ఆర్‌ను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టే విధంగా ఐఆర్బీ(RBI)కి టెండర్ కట్టబెట్టారన్నారు. ఓఆర్ఆర్ కాంటాక్ట్‌లో పెద్ద కుంభకోణం ఉందన్నారు కిషన్ రెడ్డి(Kishan Reddy).
Read Also: నీరా కేఫ్‌కు భారీ డిమాండ్.. తాగేందుకు క్యూ కట్టిన జనం
Follow us on: Google News, Koo, Twitter