నటరత్న నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాలు చేసే పనిలో ఉన్నాడు. గత రెండు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి సూపర్ హిట్ అవ్వడంతో మాంఛి ఊపు మీదున్న బాలయ్య అదే జోరును కొనసాగించాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో 108వ చిత్రం షూటింగ్ తో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. తనకు సింహా, లెజెండ్, అఖండ లాంటి భారీ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనివాస్(Boyapati) తో 109వ చిత్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జూన్ 10న బాలయ్య(Balakrishna) పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ఈ చిత్రం గురించి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం అఖండ సీక్వెల్ గా ఉంటుందని కొందరు అంటుంటే.. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ నేపథ్యంగా ఉండే చిత్రం తీయనున్నారని మరికొందరు చెబుతున్నారు. పొలిటికల్ కథ అయితే మాత్రం 2024 ఎన్నికల్లోపు షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయనున్నారట. ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది దసరా కానుకగా దీనిని విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also: రెండో పెళ్లి వార్తలపై తారకరత్న భార్య అలేఖ్య క్లారిటీ
Follow us on: Google News, Koo, Twitter