కేరళ(Kerala)లోని మలప్పురం జిల్లాలో జరిగిన ఘోర పడవ ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 11మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. తనూర్ ప్రాంతంలోని తువల్‌తీరం బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి 7.30గంటల సమయంలో ఓ హౌస్‌బోట్ బోల్తాపడింది. ప్రమాద సమయంలో పడవలో 30మంది ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వీరే కాకుండా ఇంకా చాలా మంది టికెట్ లేకుండానే పడవ ఎక్కినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మొత్తం ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 22మంది మృతదేహాలను వెలికితీశామని.. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. మరో 8మందిని కాపాడి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామన్నారు. గల్లంతైన వారి కోసం అండర్‌వాటర్ కెమెరాల సాయంతో గాలింపు చేపట్టామని పేర్కొన్నారు.
Read Also: లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి
Follow us on: Google News, Koo, Twitter