భారీ అంచనాలతో విడుదలైన ‘ఆదిపురుష్’ ట్రైలర్(Adipurush Trailer) అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. జూన్ 16న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసిన రాఘవుడి కథే ఆదిపురుష్ అంటూ విడుదలైన ట్రైలర్ అభిమానుల్లో జోష్ నింపింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, గ్రాఫిక్స్ అదరహో అంటున్నారు ఫ్యాన్స్. ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికి యూట్యూబ్ ను షేక్ చేసింది. హిందీ ట్రైలర్ కు 25 నిమిషాలు, తెలుగు ట్రైలర్ కు 31 నిమిషాలలోనే పది లక్షల వ్యూస్ రావడం విశేషం.
- Advertisement -
Read Also: స్త్రీ తన కన్నా వయసు ఎక్కువున్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి..?
Follow us on: Google News, Koo, Twitter