పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మంగళవారం అరెస్ట్ అయ్యారు. అల్ ఖదీర్ ట్రస్ట్ నిధుల దుర్వినియోగం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణకు హాజరైన PTI అధినేతను.. కోర్టు ఆవరణలో పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను రహస్య ప్రాంతానికి తరలించారు.
ఆయన అరెస్టు సమయంలో న్యాయస్థానం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలో ఇమ్రాన్ లాయర్లకు గాయాలైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇమ్రాన్(Imran Khan) అరెస్టును నిరసిస్తూ ఆయన పార్టీ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే మద్దతుదారులు రోడ్లపై నిరసనలకు దిగారు. కాగా ఆర్మీ మద్దతుతో ప్రధాని అయిన ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయాలతో సైన్యంలోని అధికారులు ఆగ్రహించారు. దీంతో ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా గతేడాది పదవి కోల్పోయారు.
#WATCH | "Pakistan Rangers abducted PTI Chairman Imran Khan," tweets Pakistan Tehreek-e-Insaf (PTI)
(Video source: PTI's Twitter handle) pic.twitter.com/ikAS2Pxlpw
— ANI (@ANI) May 9, 2023
Read Also: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఆదిపురుష్ ట్రైలర్
Follow us on: Google News, Koo, Twitter