తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తండ్రి నందమూరి తారకరామారావుపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారని అన్నారు. ఎన్టీఆర్ ప్రజా జీవితంలోకి వచ్చి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. భావి తరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలచారని కొనియాడారు. అనంతరం బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్య సేవలను వివరించారు.
- Advertisement -
Read Also: ఇంటర్మీడియట్ పూర్తైన విద్యార్థులకు బిగ్ అలర్ట్
Follow us on: Google News, Koo, Twitter