జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ చేసిన రాబోయే ఎన్నికల పొత్తుల వ్యాఖ్యలకు ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘చంద్రబాబు(Chandrababu) కంటే దారుణంగా… పవన్ కళ్యాణ్.. తన ఫ్యాన్స్‌ని వెన్నుపోటు పొడిచారని రాశారు. పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్‌నీ, కాపులనే కాకుండా… తనను తాను వెన్నుపోటు పొడుచుకున్నారని కూడా కామెంట్ ఇచ్చారు. ఆర్జీవీ(RGV) అంతటితో వదల్లేదు.. పవన్ కళ్యాణ్‌పై ఓ కామెడీ వీడియో కూడా పోస్ట్ చేశారు. అందులో తాజాగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌ని కూడా యాడ్ చేసి… జనసేనాని తుస్సు మనిపించారనేలా వీడియో చేశారు.
Read Also: ముఖ్యమంత్రి పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter