ట్విట్టర్‌కు కొత్త సారథిని నియమిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్(Elon Musk) ప్రకటించారు. సీఈవోగా ఒక మహిళను నియమించనున్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు. ఆరు వారాల్లోగా ఆమె నియామకం పూర్తవుతుందని చెప్పారు. ఈ మేరకు ఈ విషయాన్ని స్వయంగా ఎలన్ మస్క్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను ట్విట్టర్‌కు సీఈఓ(Twitter CEO)గా వ్యవహరిస్తున్నందునా ఆ బాధ్యతలను ఓ మహిళకు అప్పగించిన అనంతరం తాను చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్ట్, సాఫ్ట్ వేర్ విభాగాల బాధ్యతలు చూసుకోనున్నట్లు మస్క్(Elon Musk) ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ప్రకటనపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. గతంలో తన పెంపుడు కుక్క ఫ్లోకిని ట్విట్టర్ కొత్త సీఈఓ ఇతనే అంటూ కుర్చిలో కూర్చోబెట్టి ఎలన్ మస్క్ అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కొత్త సీఈఓ రాబోతున్నారని ఆయన చేసిన ప్రకటనపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఆమె ప్రస్తుతం ఎన్ బీసీ యూనివర్సల్ మీడియాలో గ్లోబల్ అడ్వర్టైజింగ్ అండ్ పార్టనర్ షిప్స్ చైర్మన్‌గా ఉన్నట్లు సమాచారం.