ఎండాకాలం రావడంతో మామిడిపండ్లకు గిరాకీ ఏర్పడింది. అందులోనూ పచ్చిమామిడి కాయలను(Raw Mangoes) ముక్కలుగా కోసి కారం అద్ది తింటే ఆ మజానే వేరు. పిల్లలు, పెద్దలు తెగ తినేస్తూ ఉంటారు. పచ్చిమామిడి కాయల్లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చిమామిడి((Raw Mangoes)) తినడం వల్ల అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా వడదెబ్బ తగలకుండా డిహైడ్రేషన్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. దీనిలో ఉన్న విటమిన్ A,C,Eలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిగుళ్ల సమస్యల్ని దూరం చేస్తుంది. పచ్చిమామిడి పండ్లలో మాంగిఫెరిన్ కంటెంట్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ యాసిడ్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడంతో గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఇందులో కొల్లాజెన్ శాతం ఎక్కువగా ఉండడంతో జుట్టు సమస్యలు దూరమై ఆరోగ్యంగా పెరుగుతాయి. వీటితో పాటు ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఉంటాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, కొన్ని అధ్యయనాల ప్రకారమే ఈ ఆర్టికల్ అందించాం.
Read Also: పరగడుపునే నీళ్లు తాగడానికి 5 కారణాలు
Follow us on: Google News, Koo, Twitter