తిరుమల(Tirumala) వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవారి దర్శనం, తదితర సేవలకు సంబంధించిన ఆన్ లైన్ టికెట్ల విడుదల క్యాలెండర్ ను ప్రకటించింది. అన్ని రకాల టికెట్ల విడుదల తేదీలను ఈ క్యాలెండర్ లో పొందుపరిచింది. ఏ తేదీల్లో ఏ సేవాల టికెట్లు అందుబాటులో ఉంటాయో తెలిపింది. ఈ క్యాలెండర్ భక్తులకు ఉపయోగకరం కానుంది. ప్రతి నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయనుంది. అలాగే 21వ తేదీన వర్చువల్ సేవా టికెట్లు, నేరుగా బుక్ చేసుకునే సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 23వ తేదీన అంగప్రదక్షిణం, వృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లతో పాటు శ్రీవాణి ట్రస్టు టికెట్లు.. 24వ తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశం దర్శన టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక 25వ తేదీన వసతి గదుల కోటా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ.
శ్రీవారి దర్శనం, పలు సేవా టికెట్ల క్యాలెండర్ విడుదల
-