కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ఇది ఏ ఒక్కరి విజయమో కాదని అందరి విజయమన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త శ్రమించి పార్టీ విజయం కోసం పనిచేశారని వెల్లడించారు. పేదల పక్షాన కాంగ్రెస్ పోరాడింది కాబట్టే ఇంత పెద్ద విజయం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా కన్నడ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. తాము ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలను తొలి క్యాబినేట్ లోనే నెరవేరుస్తామని కీలక హామీ ఇచ్చారు. ఇకపై అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో విద్వేష రాజ్యం ముగిసిందని.. ప్రేమించే రాజ్యం ప్రారంభమైందని రాహుల్ వ్యాఖ్యానించారు.
- Advertisement -
Read Also: కర్ణాటకలో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్
Follow us on: Google News, Koo, Twitter


 
                                    