తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు(Jallikattu)పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జల్లికట్టును అనుమతిస్తూ 2017లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థించింది. జల్లికట్టు అనేది క్రీడ సాంస్కృతిక వారసత్వంలో భాగమని.. పోటీలపై ఎలాంటి నిషేధం లేదని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించిందని స్పష్టం చేసింది. జల్లికట్టును నిషేధించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది. జల్లికట్టుకు అనుకూలంగా తీర్పు రావడంతో తమిళనాడులో సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also: బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్
Follow us on: Google News, Koo, Twitter