ఇండ్ల స్థలాల కోసం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జర్నలిస్టు సంఘాలు భారీ ధర్నా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జర్నలిస్టుకు ధర్నాకు బీఎస్పీ(BSP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి బలవంతంగా అమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం.. జర్నలిస్టులకు జాగాలు ఇచ్చేందుకు మాత్రం వెనకడుగు వేస్తోంది. సుప్రీంకోర్టు కేసు క్లియర్ అయిన తరువాత కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్‌ను వారికి అప్పగించడం లేదు. అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే.
బీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే బహుజన ప్రభుత్వంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తం. తెలంగాణలో తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న జర్నలిస్టు మిత్రులకు BSP సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. జర్నలిస్టులతో పాటు జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్ కార్డులు,హెల్త్ కార్డులు ఇస్తాము. అన్ని హంగులతో హైదరాబాద్‌లో జర్నలిస్ట్ భవన్ కడతాం.’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) హామీ ఇచ్చారు.
Read Also: కాంగ్రెస్‌లో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Follow us on: Google News, Koo, Twitter