రూ.2 వేల నోట్ల చెలామణిపై ఆర్బీఐ(RBI) సంచలన ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆ నోట్లు నిల్వ చేసుకున్న వారంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, రెండు వేల నోట్లను వినియోగదారులకు ఇవ్వొద్దని బ్యాంకులకు సైతం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది. ఈనెల(మే) 23 నుంచి దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. మొదటి విడతలో రూ.20 వేలు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్లు ముద్రణ నిలిపివేశామని ఆర్బీఐ(RBI) స్పష్టం చేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా నోట్లు రద్దు చేసినట్లు తెలిపింది.
RBI సంచలన నిర్ణయం.. దేశంలో రూ.2 వేల నోట్లు రద్దు
-
Previous article
Read more RELATEDRecommended to you
Jhansi Medical College | యూపీలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారులు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీ బాయి మెడికల్...
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
Jaishankar | మోదీతో భేటీ అంత ఈజీ కాదు: జైశంకర్
ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ కావడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి...
Latest news
Must read
Ramamurthy Naidu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం
తమ్ముడు నారా రోహిత్(Nara Rohit) తండ్రి నారా రామ్మూర్తి నాయుడు(Ramamurthy Naidu)...
Glowing Skin | చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్
Glowing Skin | చలికాలంలో డ్రై స్కిన్ వేధిస్తుంటుంది. దీనికి తోడు...