రూ.2000 నోట్లు(2000 Rupee Note) ఉపసంహరణ చేస్తున్నట్లు ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ఈనెల 23 నుంచి బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ఖాతా ఉన్న బ్యాంకులో మాత్రం ఎన్ని రూ.2000 నోట్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది. అలా కాకుండా నోట్లు మాత్రమే మార్చుకోవాలని అనుకునే వారు ఏ బ్యాంకు బ్రాంచికైనా వెళ్లి మార్పిడది చేసుకోవచ్చని వివరించింది. అయితే ఇలా మార్చుకోవాలంటే ఓ వ్యక్తి ఒక లావాదేవికి రూ.20వేలు మాత్రమే ఎక్స్ ఛేంజ్ చేసుకోవాలంది.
బ్యాంకులే కాకుండా బ్యాంకింగ్ సేవలందించే సంస్థల్లో కూడా రూ.2వేల నోటును మార్చుకోవచ్చని వెల్లడించింది. కానీ ఒకరోజులో రూ.4వేలను మాత్రమే మార్చుకునేందుకు పరిమితి విధించింది. బ్యాంకుల్లో కానీ, బ్యాంకింగేతర సంస్థల్లో కానీ రూ.2 వేల నోట్లను(2000 Rupee Note) మార్చుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని RBI స్పష్టం చేసింది.
Read Also: తెలంగాణ అవతల బీఆర్ఎస్ తొలి విజయం.. మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బోణీ
Follow us on: Google News, Koo, Twitter