కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం

-

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. కన్నడనాట 24వ ముఖ్యమంత్రిగా(Karnataka CM) సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌(DK Shivakumar) ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ వీరి చేత ప్రమాణం చేయించారు. వీరితో పాటు ఎనిమిది మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), అగ్రనేతలు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సహా బిహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కమల్ హాసన్(Kamal Haasan) తదితరులు హాజరయ్యారు. కాగా ఈనెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. 13న ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 స్థానాలు గెలిచి అధికారం చేపట్టింది.

- Advertisement -
Read Also: నెల్లూరు వైసీపీలో తారాస్థాయికి విభేదాలు.. అబ్బాయ్ వర్సెస్ బాబాయ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...