తమిళ స్టార్ హీరో సూర్య(Actor Surya)కు తెలుగులోనూ మాంచి ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటించిన యముడు, సింగం, జైభీమ్, గజిని వంటి సినిమాలు అనేకం తెలుగులోనూ సత్తా చాటాయి. అయితే, ఇటీవల జరిగిన ఓ ఇన్సిడెంట్‌కు హీరో సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. యూఏస్ టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి తాటికొండ ఐశ్వర్య(Aishwarya) మరణించిన విషయం తెలిసిందే. ఆమె తమిళ స్టార్ హీరో సూర్యకు చాలా పెద్ద అభిమాని. ఈ విషయం తెసులుకున్న సూర్య.. ఆమె మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐశ్వర్య చిత్ర పటానికి నివాళులు అర్పించి.. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ లేఖ కూడా రాసాడు. ఈ లేఖలో సూర్య(Actor Surya).. “ఐశ్వర్య మృతి తీరని లోటు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు. మన జ్ఞాపకాల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటింది” అంటూ ఆమె తల్లిదండ్రులను ఓదార్చాడు.
Read Also: తప్పుడు వార్తలపై స్పందించి బాధపడిన తమన్నా
Follow us on: Google News, Koo, Twitter