Telangana |జూన్ 5 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో విడుత గొర్రెల పంపిణీని నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర(Telangana) దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో 2 వ విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గొర్రెల పంపిణీ జరుగుతుందని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులంతా పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన లబ్దిదారులందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధకశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలోతెలంగాణ షీప్స్, గోట్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ , శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter