హైదరాబాద్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు(IT Raids) చేపట్టారు. నగరంలోని సుమారు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కోహినూర్ గ్రూప్(Kohinoor Group) తో పాటు మరో రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాదన్నపేట, బంజారాహిల్స్, కొండాపూర్, మెహదీపట్నం, శాస్త్రిపురం ఏరియాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే అధికారులు దాడులు(IT Raids) చేపట్టారు. మాదన్నపేట రామచంద్ర నగర్ లోని కోహినూర్ డెవలపర్స్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కోహినూర్ డెవలపర్స్ సంస్థ నగరంతో పాటు శివార్లలోనూ భారీ ప్రాజెక్టులు చేపట్టింది. అయితే ఈ సంస్థ వెనక ఓ బడా రాజకీయ నాయకుడి హస్తం ఉందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
Read Also:
1. హీరోయిన్ డింపుల్ హయతి వీరంగం.. క్రిమినల్ కేసు నమోదు
2. లైక్ చేసింది.. పాపం రూ.19లక్షలు పోగొట్టుకుంది
Follow us on: Google News, Koo, Twitter