మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి(Erra Gangireddy)కి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. జులై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు(TS High Court) ఉత్తర్వులపై స్టే విధించింది. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల్లో జులై 1న గంగిరెడ్డి(Erra Gangireddy)ని బెయిల్ పై విడుదల చేయాలని తెలిపింది. హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also:
1. వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ వదిలిపెట్టదు: బీజేపీ
2. పరగడుపునే నీళ్లు తాగడానికి 5 కారణాలు
Follow us on: Google News, Koo, Twitter