దివంగత ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుంబంధం చిరస్మరణీయం అని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకుంటూ ట్విటర్ వేదికగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు… చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ ఎన్టీఆర్. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
చరిత్ర NTR గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది: చిరంజీవి
-