కేసీఆర్ పరిపాలన చూసి దేశం నవ్వుకుంటోంది: YS షర్మిల

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సాధించింది ఏమీ లేకపోయినా దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నాడని మండిపడ్డారు. పదేండ్లలో సీఎం కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లేనని ఆరోపించారు. కేసీఆర్ ప్రసంగమంతా అబద్ధాలమయం, అరచేతిలో వైకుంఠమని విమర్శించారు. రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోతుందో లేదో తెలియదు కానీ కేసీఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటుందని చెప్పారు. రెండు సార్లు ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్(KCR) నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు పెరిగితే .. ఒక్కొక్కరి మీద రూ.1.50లక్షల అప్పు ఎందుకు ఉన్నట్లని షర్మిల(YS Sharmila) ప్రశ్నించారు. 2014లో రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రం.. 2023 నాటికి 5 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు చేరుకున్నట్లని నిలదీశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను సొంత ప్రాజెక్టులుగా చెప్పుకోడానికి కేసీఆర్‌కు సిగ్గుండాన్నారు. డిజైన్ మార్చి లక్ష కోట్లకు పెంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని కాళేశ్వరం(Kaleshwaram Project) కట్టి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు.

Read Also:
1. 14ఏళ్ల తర్వాత మళ్లీ శుక్రవారం రోజే.. బ్లాక్ ఫ్రైడే 
2. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.. రైలు ప్రమాదంపై పవన్ కల్యాణ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...