వైసీపీకి లోకేశ్ కొత్త పేరు అదిరింది

వైసీపీకి లోకేశ్ కొత్త పేరు అదిరింది

0
115

రివర్స్ రివర్స్ అంటూ ఈ డిప్ప గవర్నమెంట్ చివరకు చిప్ప మిగిల్చేట్టు ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ ఆరోపించారు… ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు.

ఒక పక్క 628 కోట్లు ఆదా చేసాం అని చెప్పుకుంటూ మరో పక్క ఇసుక ఖర్చు పెరిగింది అని 500 కోట్లు చెల్లించడం చూస్తుంటే డిప్ప గొరిగి విగ్గు పెట్టి మళ్ళీ గొరిగినట్టు ఉందని ఎద్దేవా చేశారు లోకేశ్. ఐదు నెలల్లోనే ఇంత దారుణమైన పరిస్థితులు తెస్తే, ఐదేళ్ళలో ఎవరూ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదంటున్నారు లోకేశ్.

జగన్ మోహన్ రెడ్డిని నమ్మి మీకు ఓటేసిన పాపానికి ప్రజలను ఇలా చావు ముందు నిలబెడతారా? ప్రజలను ఇన్నిరకాలుగా బాధ పెడుతూ మీకెలా నిద్రపడుతోంది? కాస్తయినా మానవత్వం ఉండాలని లోకేశ్ అన్నారు!