టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటిస్తోన్న చిత్రం టిల్లు-2(Tillu 2). డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. మల్లిక్‌రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి(Tillu 2) సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కారులో రొమాన్స్ చేసుకుంటున్న టిల్లు-అనుపమ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మా డీజే టిల్లు థియేటర్లలో భారీ పార్టీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మ్యాడ్ రైడ్ సెప్టెంబర్ 15న షురూ అంటూ పోస్టర్‌ను షేర్ చేశాడు నిర్మాత నాగవంశీ. సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.