కేంద్ర కీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur)తో రెజ్లర్ల(Wrestlers) సమావేశం ముగిసింది. దాదాపు ఆరుగంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలకమైన విషయాలపై చర్చించారు. మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్(Brij Bhushan Singh) మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ(WFI) చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు. దీంతో ఈనెల 30లోగా WFI ఎన్నికలను నిర్వహిస్తామని అనురాగ్ హామీ ఇచ్చారు. అలాగే జూన్ 15లోగా రెజ్లర్లు ఎలాంటి నిరసనలు చేపట్టరాదని రెజ్లర్లను అనురాగ్ కోరగా.. అందుకు అంగీకరించిన వారు అప్పటివరకు తమ ఆందోళన విరమించుకుంటామని తెలిపారు. అయితే అప్పటిలోగా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే తమ నిరసన కొనసాగుతుందని రెజ్లర్లు(wrestlers) స్పష్టంచేశారు. కాగా ఈ సమావేశంలో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్, భజరంగ్ పునియా సహా పలువురు రెజ్లర్లు, రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ పాల్గొన్నారు.
జూన్ 15వరకు ఆందోళనకు విరామం ప్రకటించిన రెజ్లర్లు
-
Previous article
Read more RELATEDRecommended to you
Parliament Winter Session | పార్లమెంటు సమావేశాలకు వేళాయే.. రేపటి నుంచే సభలు..
పార్లమెంటు శీతాకాల సమావేశాలు(Parliament Winter Session) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి....
Uttar Pradesh | యూపీలో హింసాత్మకంగా మారిన సర్వే.. ముగ్గురు మృతి ..
ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని సంభాల్‌లో హింస చెలరేగింది. హిందూ ఆలయాన్ని కూల్చి మొఘలులు...
Hemant Soren | ప్రభుత్వం ఏర్పాటుకు సోరెన్ సిద్ధం.. ప్రమాణ స్వీకారం అప్పుడే
ఝార్ఖండ్(Jharkhand)లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమి ఘన విజయం సాధించింది. దీంతో...
Latest news
Must read
Pawan Kalyan | హిందువులపై అఘాయిత్యాలు ఆపాలి: పవన్ కల్యాణ్
బంగ్లాదేశ్(Bangladesh) వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దారుణ దాడులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,...
Hyderabad | పేలిన ఇంకో ఈవీ బైక్.. 9బైకులు దగ్ధం
హైదరాబాద్(Hyderabad) రామాంతపూర్ పరిధిలో వివేక్ నగర్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం...