మరో వివాదంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్(Adipurush). ప్రభాస్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఆదిపురుష్ చిత్ర ట్రైలర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రామాయణంలో రాసినట్లుగా రావణుడు భూమితో సహా సీతమ్మను ఎత్తుకెళతాడు. ఇప్పటి వరకు వచ్చిన రామాయణ సినిమాల్లో కూడా అదే చూపించారు. ‘రామదాసు’ సినిమాలోనూ సేమ్ సీన్ ఉంది. ఇక పర్ణశాలలో రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిన జాడలు కూడా ఉన్నాయి. కానీ ‘ఆదిపురుష్(Adipurush)’లో మాత్రం అలా కాకుండా రావణుడు తన మాయాజాలంతో సీతమ్మను తాళ్లతో బంధించి గాలిలోనే తీసుకెళ్లినట్టు చూపించారు. దీంతో నెటిజన్స్ దీనిపై ట్రోల్స్ చేస్తున్నారు. ‘మీకు రామాయణం తెలుసా? స్టోరీ మార్చి తియడం కరెక్ట్ కాదు. అన్ని చూసుకోవాలి కదా’ అంటూ విమర్శిస్తున్నారు.

Read Also:
1. నటి డింపుల్ హయాతీకి తెలంగాణ హైకోర్టు షాక్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...