బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో భాగంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో 5 నెలల్లో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్(KCR), మంత్రులు హరీశ్ రావు(Harish Rao), కేటీఆర్(KTR) వారి తాత, ముత్తాతలు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకునే సత్తా, దమ్ము, ధైర్యం లేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల వారోత్సవాలు చేసే అర్హత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. కొత్తగా రాష్ట్రంలో ఒక్క చిన్న చెరువు అయినా తవ్వారా అని భట్టి(Bhatti Vikramarka) నిలదీశారు.