రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక బీజేపీలో చేరిన కీలక రాజకీయ నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan).. ఆ తర్వాత బీజేపీలో ఇమడలేక అధికార బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో దాసోజుకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. రాజకీయంగానూ కాస్త సైలెంట్ అయిపోయారు. ఫోకస్ మొత్తం రాబోయే ఎన్నికలపై పెట్టి.. ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రవణ్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) ఉన్నారు. లెటెస్ట్ ఎమ్మెల్సీ రేసులో శ్రవణ్ పేరు వినిపిస్తోంది. దీంతో దానంను వదులుకోలేక కేసీఆర్ కీలక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో దాసోజు(Dasoju Sravan)కు ఎమ్మెల్సీ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై పెద్దల హామీ ఉందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉంది. పార్టీకి సేవల విషయంలో అప్పుడు, ఇప్పుడు శ్రవణ్ రోల్ ఏం మారలేదంటున్నారు కొందరు నేతలు. మరి దాసోజును పదవి వరిస్తుందో లేదో చూడాలి.