ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా(Minister RK Roja) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాలినొప్పి, వాపుతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని థౌజెండ్ లైట్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా కాలు నొప్పి, వాపు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. మంత్రి అనారోగ్యానికి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజా అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలుసుకున్న అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు లోనయ్యారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.