అల్లు అర్జున్ రెండు సాంగ్స్ కు 3 కోట్ల లాభం

అల్లు అర్జున్ రెండు సాంగ్స్ కు 3 కోట్ల లాభం

0
88

గతంలో ఆడియో మార్కెట్ పెద్దగా ఉండేది కాదు.. ఇప్పుడు దాని పేరు డిజిటర్ రైట్స్ అయింది. అయితే ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న సంస్దలే ఈ బిజినెస్ రన్ చేస్తున్నాయి.. అందులో ముందు ఉంటుంది ఆదిత్య మ్యూజిక్.. పెట్టుబడి విషయంలో వెనకడుగు వేయదు. భారీ బడ్జెట్ చిత్రాలు అన్నీ అక్కడే ట్రెండ్ అవుతాయి. ఇక డిజిటల్ రైట్స్ వీడియో సాంగ్స్ రైట్స్ లో సౌత్ లో టాప్ గా ఉంది. ఇక తాజాగా అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలో సినిమా ఆడియో వీడియో సాంగ్స్ పబ్లిసిట్ కంటెంట్ హక్కులు పొందింది, దాదాపు వీటికి 3 కోట్లు చెల్లించింది అని టాక్.

అయితే ఇప్పుడు రెండు పాటలతో ఆ పెట్టుబడి వచ్చేస్తోంది అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు.. అవును సామజవరగమన సాంగ్ మొత్తం 100 మిలియన్లకు చేరింది అని తెలుస్తోంది అన్నీ ఫ్లాట్ ఫామ్స్ లో , ఇక ఫుల్ వీడియో సాంగ్ వస్తే కచ్చితంగా అదో 100 మిలియన్లకు చేరుతుంది దీని నుంచే సుమారు 1.50 కోట్లు వస్తుంది అని తెలుస్తోంది.

ఇక రెండో సాంగ్ రాములో రాములు పాట కూడా సూపర్ ఫేమ్ వచ్చింది అప్పుడే 50 మిలియన్ల మార్క్ తాకింది.. దీంతో ఇది కూడా లాంగ్ రన్ లో కోటి రూపాయలు తీసుకువస్తుంది అంటున్నారు అంటే మొత్తానికి జనవరికే సుమారు ఈ రెండు సాంగ్స్ పెట్టిన పెట్టుబడి తీసుకువస్తాయి అంటున్నారు, ఇక తర్వాత సినిమాపై వచ్చే కంటెంట్ పాటలు అన్నీ ఆ సంస్ధకు లాభాలే అని టాలీవుడ్ టాక్.