బీఆర్ఎస్ బహిష్కృతనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యవహారం తుది అంకానికి చేరుకుంది. హైదరాబాద్ లోని పొంగులేటి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెళ్లి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌లోకి పొంగులేటి చేరడం దాదాపు ఖరారు కావడంతో ఇతర అంశాలపై చర్చించనున్నారని సమాచారం. పొంగులేటి తో పాటు ఆయన అనుచరులు ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) తిరిగి ఇండియాకు వచ్చాక పొంగులేటి చేరిక ఉండే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మరో సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో(Jupally Krishna Rao) పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. మొత్తానికి వీరి చేరికతో తెలంగాణలో కాంగ్రెస్(Telangana congress) పార్టీ బలం రెట్టింపు అవుతుందనడంతో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
పొంగులేటితో భేటీ కానున్న రేవంత్ రెడ్డి
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Ravanth Reddy | ‘ఢిల్లీకి ఎన్ని సార్లైనా వెళ్తా.. ఈరోజు అందుకే వెళ్తున్నా’
తన ఢిల్లీ పర్యటనలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి(Ravanth...
Revanth Reddy | జైలుకెళ్లడానికి కేటీఆర్ తపనపడుతున్నారా..?
మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)...
Revanth Reddy | ‘అదానీ విరాళం తీసుకోం’.. ప్రకటించిన సీఎం
అదానీ లంచాల వ్యవహారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో...
Latest news
Must read
Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్
బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...
Ravanth Reddy | ‘ఢిల్లీకి ఎన్ని సార్లైనా వెళ్తా.. ఈరోజు అందుకే వెళ్తున్నా’
తన ఢిల్లీ పర్యటనలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి(Ravanth...