హెల్మెట్లతో పనిచేస్తున్న ఉద్యోగులు రీజన్ వింటే మతిపోతుంది

హెల్మెట్లతో పనిచేస్తున్న ఉద్యోగులు రీజన్ వింటే మతిపోతుంది

0
94

సాధారణంగా మనం హెల్మెట్లను ఎప్పుడు పెట్టుకుంటాం అంటే బైక్ నడిపే సమయంలో అని చెబుతాం, అంతేకదా మరెక్కడా హెల్మెట్ పెట్టుకోం ఇది పక్కా, కాని ఇప్పుడు ఓ చోట ఉద్యోగులు హెల్మెట్ ని ఎలా వాడుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అవును యూపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులో హెల్మెట్లు పెట్టుకుని మరీ విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఎందుకో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు

ఉత్తరప్రదేశ్లోని బాందాలో ఉన్న విద్యుత్ కార్యాలయంలో సిబ్బంది నిత్యం హెల్మెట్లను ధరించి పనిచేస్తున్నారు దీనికి కారణం పైన ఉన్న శ్లాబు మొత్తం పెచ్చులూడి పోతోందట, దీంతో ఆ బిడ్డింగ్ ఎప్పుడు పడిపోతుందో తెలియడం లేదట పలువురికి పెచ్చులుపడి గాయాలు అయ్యాయి, దీంతో వారు హెల్మెట్లు పెట్టుకుంటున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే మరికొందరు మాత్రం మీ తలపై పెచ్చులు పడకపోయినా చేతిపై పడితే మీకు మరింత ప్రమాదం జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు, అంతేకాదు యూపీ అంటే దేశంలో అతి పెద్ద స్టేట్ మరి అక్కడ ఉద్యోగులకు ఇన్ని కష్టాలు ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదా, పైగా నిత్యం

విద్యుత్ బిల్లులు కట్టడానికి జనం వస్తారు వారికి ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్దితి ఏమిటి అని అడుగుతున్నారు జనం, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ వెళ్లడంతో తక్షణం అక్కడ నుంచి కార్యాలయం మారుస్తామని అదే ప్రాంతంలో కొత్త బిల్డింగ్
నిర్మాణం చేపడతామని తెలిపారట.. మొత్తానికి మరోసారి సోషల్ మీడియా తన పవర్ చూపించింది అంటున్నారు నెటిజన్లు.