గర్భిణులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌ న్యూస్‌

-

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ మహిళలలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ‘కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను(KCR Nutrition Kits)’ ప్రవేశపెట్టింది. నిజానికి ఈ పథకం ఇప్పటికే తెలంగాణలో 9 జిల్లాల్లో ప్రారంభం కాగా.. తాజాగా రాష్ట్రమంతా అమలు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌(KCR) భూమిపూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు. గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ఈ కిట్లను తొలుత ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌ కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో అందించగా ఇప్పుడు రాష్ట్రమంతా అమలు చేస్తామని తెలిపారు. ఇక ఈ కిట్‌(KCR Nutrition Kits) విలువ రూ. 2 వేలుగా ఉంటుంది.

Read Also:
1. తెలంగాణకు 5 అంతర్జాతీయ అవార్డులు.. ఇండియాలో ఇదే ఫస్ట్ టైం!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...