Ludhiana Robbery |సముద్రమంతా ఈది ఇంటి ముందు కాల్వలో చనిపోయినట్లు కోట్లు దొంగతనం చేసిన ఓ లేడి కిలాడీ రూ.10 కూల్ డ్రింక్ కోసం కక్కుర్తి పడి పోలీసులకు పట్టుబడింది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ నెల 10న సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ సంస్థలో రూ.8.49 కోట్ల విలువైన సొమ్మును డాకూ హసీనా అలియాస్ మన్‌దీప్ కౌర్ దోచుకొంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తన భర్త జస్వీందర్ సింగ్‌తో నేపాల్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో పుణ్యక్షేత్రాలు చూసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు మన్ దీప్ సహచరుడు గౌరవ్‌ను అరెస్టు చేసి కీలక వివరాలు రాబట్టారు. నిందితులు హరిద్వార్, కేదార్‌నాథ్, హేమ్‌కుండ్ సాహెబ్ క్షేత్రాలను దర్శించనున్నట్లు సమాచారం అందింది. హేమ్‌కుండ్ సాహెబ్‌కు నిత్యం వేల మంది యాత్రికులు వస్తుంటారు. దీంతో యాత్రికులకు ఉచితంగా డ్రింక్ పంపిణీ ప్రణాళికను పోలీసులు అమలు చేశారు. పోలీసులు ఊహించినట్లుగానే ఉచిత డ్రింకును తీసుకోవడానికి మన్‌దీప్ జంట వచ్చింది. దీంతో ఆ కేడీ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు పోలీసులు ‘లెట్స్ కేజ్ క్వీన్ బీ’ అని పేరు పెట్టారు. గతంలో బీమా ఏజెంట్‌గా పనిచేసిన మన్‌దీప్.. సంపన్నురాలిగా మారదామనే ఉద్దేశంతో సీఎంఎస్ సంస్థలో ఉద్యోగులను బందీలుగా చేసుకొని భారీ దోపిడీ(Ludhiana Robbery)కి పాల్పడింది.
Read Also:
1. చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాక్ జోడీ
2. సీఎం జగన్ ప్రజాసంపదను కొల్లగొడుతున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat