Hyderabad | భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

-

Hyderabad | సికింద్రాబాద్ పరిధిలోని బన్సీలాల్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ముందుగా తన ఇద్దరు పిల్లల్ని భవనం పైనుంచి కిందకి తోసేసి.. ఆ తర్వాత తల్లి కూడా పైనుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని దగ్గర్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. భర్త వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
Read Also:
1. రూ.10 కోసం కక్కుర్తిపడి పోలీసులకు చిక్కిన గజదొంగ
2. కల్తీ ఐస్ క్రీముల తయారీ ముఠా గుట్టు రట్టు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...