Soyam Bapu Rao | సొంత పార్టీ నేతలపై ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు

-

ఎంపీ నిధులు తానే వాడుకున్నాడని ఆ నిధులతోనే ఇల్లు, కుమారుడి పెళ్లి చేశాడని వస్తున్న వార్తలపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు(Soyam Bapu Rao) స్పందించారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలపై బాపూరావు మండిపడ్డారు. తనపై సొంత పార్టీ నేతలు కుట్ర చేశారని అన్నారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్(Rathod Ramesh), జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌(Payal Shankar)పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు గోల్మాల్ చేశానని ఆ ఇద్దరు బీజేపీ నేతలు తనను బద్నాం చేశారని తెలిపారు. ఆదివాసీ బిడ్డ అయిన తన ఉన్నతిని ఓర్వలేకే వారు కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో ఆదిలాబాద్‌లో బీజేపీ లేదని, తాను ఆ పార్టీలో చేరిన తర్వాతే జిల్లాలో పార్టీ బలోపేతం అయిందని తెలిపారు. జిల్లాలో పార్టీ ఎదుగుదలకు తాను చాలా కష్టపడ్డానని అన్నారు. అటువంటి తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. తాను ఎంపీ లాడ్స్ నిధులను దుర్వినియోగం చేయలేదని బాపురావు(Soyam Bapu Rao) అన్నారు.

- Advertisement -
Read Also:
1. ఆ నిధులను సొంత అవసరాలకు వాడుకున్నా.. తప్పేంటి?: BJP MP
2. తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...