Telangana |ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2.73 శాతం డీఏ పెంచుతూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం జూన్ 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు (పింఛనుదారులు)కు కూడా వర్తించనున్నట్లు మరో జీవోలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. పెంచిన డీఏను జూన్ నెల జీతంలో కలిపి జూలై 1వ తేదీన చెల్లించనున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదార్లకు లబ్ధి కలుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ(Telangana Govt) ఖజానాపై నెలకు రూ. 81.18 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ. 974.16 కోట్ల మేర భారం పడుతుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
Read Also:
1. నేను గుండానే అయితే.. కేసీఆర్ నా ఇంట్లో భోజనం ఎలా చేశారు: కొండా మురళి
2. తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త
Follow us on: Google News, Koo, Twitter, ShareChat