ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చి ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగరేసేందుకు ఇప్పటినుండే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టేశారు పార్టీ అధినేతలు. సర్వేలు చేస్తూ.. నియోజకవర్గాల వారీగా రిపోర్టులు సేకరిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇంకోవైపు ఎన్నికల్లో టికెట్ కోసం కుస్తీ పడుతూ బిజీగా గడుపుతున్నారు ఆశావహులు, సిట్టింగులు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలకు ఝలకిచ్చారు ఏపీ సీఎం జగన్(CM Jagan). ఆయన ఇచ్చిన షాక్ తో సదరు ఎమ్మెల్యేలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఇంతకీ సీఎం అంతలా వారిని ఏం చెప్పి భయపెట్టించారో ఇప్పుడే తెలుసుకుందాం.
ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ‘సురక్ష పథకం(Suraksha Scheme)’ పై జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 15 మంది ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యేలపై నియోజకవర్గ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆగ్రహించారట. ప్రజల్లో పాజిటివ్ టాక్ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కష్టమన్నారట. టికెట్ రాకపోతే నన్ను బాధ్యున్ని చేయొద్దని తేల్చి చెప్పారట జగన్. పద్ధతి మార్చుకోవాలని, ప్రజల్లో తిరగాలని, పార్టీని బలోపేతం చేయాలని హెచ్చరించారట. ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది వ్యక్తిగతంగా రిపోర్టులు పంపిస్తామని చెప్పారట. దీంతో ఎవరికి ఆ రిపోర్టు వస్తుందో అని, ఆ పదిహేను మంది ఎమ్మెల్యేలలో నా పేరు ఉందా అని వైసీపీ ప్రజా ప్రతినిధులు తర్జనభర్జన పడుతున్నారట.
ఇక వైసిపి అధినేత జగన్(CM Jagan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా దూసుకెళ్లిపోతారు అంతే. అనుకున్నది సాధించడానికి సొంత వారినైనా, సన్నిహితులను అయినా క్షణం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తారు అనే విమర్శ కూడా ఆయనపై ఉంది. 2019లో ఆయన సీఎం అవ్వడానికి కూడా ఎంతో పట్టుదలతో కష్టపడ్డారు. పార్టీకి నష్టం చేసే ఏ అంశాన్ని, ఏ వ్యక్తిని కూడా ఆయన సహించలేదు. ఓడిపోతారు అనుకునే వారికి దగ్గర వారైనా టికెట్ ఇవ్వలేదు. అంత స్ట్రిక్ట్ గా ఉన్నారాయన. ఈసారి కూడా టికెట్ల కేటాయింపు విషయంలో అంతే కఠినంగా నిర్ణయాలు తీసుకోనున్నారట. 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న జగన్.. ఆ 15 మందికి టికెట్ ఇస్తారా లేదా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Also:
1. అంతర్జాతీయ యోగా దినోత్సవం… నరేంద్ర మోదీ పాత్ర ఏంటి?
2. ‘పేదలను హింసించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు’
Follow us on: Google News, Koo, Twitter, ShareChat