Natti Kumar |పవన్‌పై ముద్రగడ, ద్వారంపూడి విమర్శలను తిప్పికొట్టిన నిర్మాత నట్టికుమార్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పవన్ తన ప్రసంగంలో వైసీపీ ఎమ్మెల్యేలపై వాడివేడి విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆయన విమర్శలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ సేనానిపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాపు నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను సినీ నిర్మాత నట్టికుమార్(Natti Kumar) తీవ్రస్థాయిలో ఖండించారు.పవన్ కల్యాణ్ డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు చేయడం కూడా ద్వారంపూడికి తగదని సూచించారు. సినిమా పరిశ్రమలో దాదాపు 35 ఏళ్లుగా ఉన్న తమకు ఎవరు ఎలాంటివారో తెలుసన్నార. సాయం చేయడం తప్ప పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు అలాంటివి తెలియవని తెలిపార. పార్టీ పరంగా ఎన్ని విమర్శలైనా ఒకరినొకరు చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా పవన్‌ను అలా అనడం ఎంతో బాధ కలిగించిందని నట్టి పేర్కొన్నారు.

- Advertisement -

ఇక పవన్, ద్వారంపూడి(Dwarampudi Chandrashekhar Reddy) మధ్య మాటల యుద్ధంలో ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ఎందుకు ఎంటర్ అయ్యారో అర్ధం కావడం లేదన్నారు. ముద్రగడ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడితే ఫర్వాలేదు కానీ ఒక కాపు ఉద్యమ నేతగా పవన్‌ను విమర్శించడం ఎంతమాత్రం తగదన్నారు. ముద్రగడ చేపట్టిన ఏ ఉద్యమాలు సక్సెస్ కాలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు.అయినా పవన్ కల్యాణ్ తన మాటలలో తనను అన్ని కులాల వాళ్ళు అభిమానిస్తారని.. తాను అందరివాడినని చెబుతున్నారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌పై ఇంకోసారి మాట్లాడేటప్పుడు విజ్ఞతతతో మాట్లాడాలని ముద్రగడ, ద్వారంపూడికి నట్టికుమార్(Natti Kumar) సూచించారు.

Read Also:
1. చెర్రీ కంగ్రాట్స్.. నిన్ను ఎత్తుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి: రోజా
2. వైసీపీ ఎమ్మెల్యేలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జగన్!!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...