Joe Root | నెంబర్ వన్ టెస్టు బ్యాటర్ గా జో రూట్

-

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో అదరగొట్టిన ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్‌(Joe Root).. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings) లో నెంబర్ వన్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచులో సెంచరీతో రాణించిన రూట్(Joe Root) తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్ లబుషేన్ ను వెనక్కినెట్టి టాప్ ర్యాంక్ కొట్టేశాడు. 887 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. కివీస్ ప్లేయర్ కేన్ విలియమ్స్ అనూహ్యంగా రెండు స్థానాలు ఎగబాకి 883 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక లబుషేన్ రెండు స్థానాలు దిగజారి 877 పాయింట్లతో మూడో ప్లేస్ కు పడిపోయాడు. తర్వాతి స్థానాల్లో ట్రావిస్‌ హెడ్, బాబర్ అజమ్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, ఉస్మాన్ ఖవాజా, కరుణరత్నే ఉన్నారు. కొన్ని నెలలుగా క్రికెట్ కు దూరంగా టీమిండియా క్రికెటర్ రిషన్ బంత్ పదో స్థానంలో నిలిచాడు. మరోవైపు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్‌ (860) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్ జేమ్స్ అండర్సన్, కగిసో రబాడ, ఓలీ రాబిన్‌సన్, కమిన్స్ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, అక్షర్ పటేల్ తర్వాతి ప్లేస్ లో ఉన్నారు.

- Advertisement -
Read Also:
1. అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి?
2. పవన్‌పై ముద్రగడ, ద్వారంపూడి విమర్శలను తిప్పికొట్టిన నిర్మాత నట్టికుమార్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...