టిడ్కో ఇళ్లపై ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంపై కేంద్రమంత్రి భారతీ పవార్(Bharti Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లపై మోదీ పేరు, ఫోటో.. ఆవాస్ యోజన్ లోగో లేకపోవడం చూసి అధికారులపై మండిపడ్డారు. పీఎంఏవై పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే ఏ బిల్డింగ్ మీద కేంద్రం లోగోలు లేకపోవడమేంటని నిలదీశారు. తక్షణమే ప్రతి ఇంటి మీద ఆవాస్ యోజన(Awas Yojana) లోగో కచ్చితంగా ఉండాలని భారతీ పవార్(Bharti Pawar) ఆదేశాలు జారీ చేశారు. కాగా గత టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో కలిసి ఆవాస్ యోజన పథకం కింద టిడ్కో ఇళ్లు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే గత నాలుగేళ్లుగా ఇళ్ల నిర్మాణం పూర్తిగా జరగకపోవడంతో గృహ సముదాయాలు పాడైపోతున్నాయి.
Read Also:
1. ‘చంద్రబాబు మాటలు వినడం ఆపేయ్.. చిరంజీవిని నమ్ము’
2. ఉత్కంఠంగా హీరో నిఖిల్ ‘స్పై’ ట్రైలర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat