Fuel prices | త్వరలోనే వాహనదారులకు కేంద్రం శుభవార్తం అందించనుంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించింది. రెండు మూడు నెలల్లోనే ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. నవంబర్ నుంచి వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడడంతో చమురు సంస్థలు ధరలను తగ్గించనున్నాయని సమాచారం. లీటర్ పెట్రోల్, డీజిల్ పై సుమారు రూ.5 వరకు తగ్గించవచ్చునని వార్తలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పలు రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అయితే చమురును జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు భారీగా తగ్గుతాయని అభిప్రాయం ఉంది. అందుకే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని దేశవ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
Read Also:
1. పాట్నాలో విపక్షాల సమావేశంపై బీజేపీ సెటైర్లు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat